భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 22 : అదానీ గ్రూప్ ధన దాహంతో రామన్నపేటలో కాలుష్య కారక సిమెంట్ పరిశ్రమను ఏర్పాటుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతామంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రామన్నపేటలో అంబూజా సిమెంట్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా అయితే ఉద్యమం చేశామో.. అంబుజా కంపెనీ, రేవంత్‌రెడ్డిపై అదే మాదిరి తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమాని పల్లెలు ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిపుష్టితో ఉన్నాయని, భూములు మంచి ధర పలుకుతున్నాయని తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే భూముల ధరలు అమాంతం పడిపోయే ప్రమాదం ఉందని, ఇక్కడ ప్రజల జీవనం చిన్నాభిన్నం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే రామన్నపేట, వలిగొండ, చిట్యాల, నారట్పల్లి మండలాల్లోని అనేక గ్రామాలు కాలుష్యంతో విలవిల్లాడుతాయన్నారు. వెనకబడ్డ ప్రాంతాల్లో వ్యవసాయం, కుల వృత్తులపై ఆధారపడి జీవించే రైతులు, నేత, గీత కార్మికులు, యాదవులు, ఇతర వృత్తిదారులు ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు. ప్రధానంగా రామన్నపేట, సిరిపురం, ఎల్లంకి, కొమ్మాయిగూడెం, పెద్దకాపర్తి తదితర 9 గ్రామాల ప్రజలు వలసలు పోక తప్పని పరిస్థితులు నెలకొంటాని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, రైతులు సంతోషంగా ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చడం లేదన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ గంగాధర్‌కు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్లు పెంట నర్సింహ, ఎన్నబోయిన ఆంజనేయులు, బీఆర్ఎస్ భువనగిరి పట్టణాధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మారెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, రైతు బంధు సమితి మాజీ మండలాధ్యక్షుడు బక మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడి,్డ మాజీ ఎంపీటీసీలు వేమవరం సుధీర్‌బాబు, సాల్వేర్ అశోక్, గొరిగి నరసింహ, పున్న వెంకటేశం, ఎండీ ఆమీర్, నాయకులు కన్నెబోయిన బలరాం, కోళ్ల స్వామి, మెట్టు మహేందర్‌రెడ్డి, యాదయ్య, ఎస్కే చాంద్, జాడ సంతోశ్, కూనూరు ముత్తయ్య, జంగిలి నరసింహ, మిర్యాల మల్లేశం, బాలగోని శివ, లవణం రాము, రామిని లక్ష్మణ్, కోనూరు శ్రీనివాస్, గర్దాస్ విక్రమ్, ఆవుల నరేందర్, ఆవుల శ్రీధర్, నక నరేందర్, ఎడ్ల నరేందర్‌రెడ్డి, జాడ అమరేందర్‌రెడ్డి, పున్న వెంకటేశం, బుర్ర శ్రీశైలం, గుండు రమేశ్, కన్నెబోయిన వెంకటేశం, మోటి రవీందర్, కల్లూరి నరేశ్, బాసాని రాజు, ఆజాద్, సైదులు, మహేష్, వెంకన్న పాల్గొన్నారు.