ఎన్ఐఎన్ శాస్త్రవేత కె.రాజేందర్రావు
జిల్లావ్యాప్తంగా ఘనంగా సైన్స్ దినోత్సవం
రామగిరి, ఫిబ్రవరి 28: శాస్త్ర, సాంకేతికతలో దేశ ఔనత్యాన్ని చాటి చెప్పిన సీవీ.రామన్ స్ఫూర్తితో విద్యార్థులు పరిశోధనల్లో రాణించి నూతన అంశాలను ఆవిష్కరించాలని హైదరాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రేషన్(ఎన్ఐఎన్) ఐసీఎంఆర్ శాస్త్రవేత ఆర్.రాజేందర్రావు సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంజీయూలోని యూనివర్సిటీ సైన్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంజీయూ వీసీ సీహెచ్.గోపాల్‌రెడ్డితో కలిసి సీవీ.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రదర్శనలను తిలకించి అభినందించారు. మధ్యాహ్నం సైన్స్ అంశాలపై ఆర్ట్స్ బ్లాక్ సమావేశ మందిరంలో నిర్వహించిన సెమినార్లో పవర్ ప్రజంటేషన్‌తో సైన్స్ ఆవిష్కరణలపై వివరించి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. వీసీ సిహెచ్.గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులు సైన్స్ అంశాలపై దృష్టి ఉంచి పరిశోధనలో రాణించాలన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జి.ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ॥ కృష్ణారావు, ఎంజీయూ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొ॥ వై.ప్రశాంతి, దోమల రమేశ్, ప్రేమ్‌సాగర్, మద్దిలేటి, తిరుమల, రమేశ్, భిక్షమయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
రామగిరి : జిల్లావ్యాప్తంగా సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని ఎన్జీ కళాశాలలో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ డిపార్టుమెంట్ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఎంజీయూ కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వై.ప్రశాంతి హాజరై ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ విభాగాల అధ్యాపకులు శ్రీనివాస్, నాగరాజు, సైన్స్ విభాగాల విద్యార్థులు పాల్గొన్నారు. నల్లగొండ ఆర్పీ రోడ్డులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ డే వేడుకల్లో డీఈఓ బి.భిక్షపతి పాల్గొని విద్యార్థులు ప్రదర్శనలను తిలకించి మాట్లాడారు. వేడుకల్లో జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, హెచ్ఎం పుష్పలత పాల్గొన్నారు. రామగిరిలోని నీలగిరి డిగ్రీ అండ్ ఫీజి కళాశాల ప్రిన్సిపాల్ మారం నాగేందర్‌రెడ్డి సీవీరామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల్పరించారు. చర్లపల్లిలో గల డీవీఎం కళాశాలలో సీవీ.రామన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంఈడీ, బీఈడీ, డీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పి.గంగాధర్‌రావు, బి.నారాయణరెడ్డి, ఎన్. శ్రీదేవి, సూపరింటెండెంట్ చొల్లేటి శ్రీధర్, అధ్యాపకలు ఆర్.సత్యనారాయణ, బొడ్డుపల్లి రామకృష్ణ, మేడిపల్లి రవి, ఎ.సరిత, కరుణాకర్, సిబ్బంది వేంకటేశ్వర్లు, శ్రీధర్‌రెడ్డి, విజయలక్ష్మీ చాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు.
కనగల్ / కట్టంగూర్ / నార్కట్‌పల్లి / చిట్యాల / శాలిగౌరారం : మండలంలోని చిన్నమాదారం ఉన్నత పాఠశాలలో హెచ్ఎం కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాన్సువాడ వేదాంత్ మౌర్య, సీఆర్పీ సంతోశ్‌కుమార్, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కట్టంగూర్, నార్కట్‌పల్లి, చిట్యాల, శాలిగౌరారం మండలాల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.