హాలియా, జనవరి 29 : వచ్చేనెల ఒకటి నుంచి 4 వరకు మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో జరిగే జాతీయస్థాయి 49వ జూనియర్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లకు కెప్టెన్లుగా జిల్లా వాసులు ఎంపికయ్యారు.
రాష్ట్ర బాలుర జట్టుకు మిర్యాలగూడ మండలం ఆలగడపకు చెందిన ఎన్. లక్ష్మణ్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. బాలికల జట్టుకు అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్ గ్రామానికి చెందిన ఎస్కే ఆయేషా కెప్టెన్గా వ్యవహరించనున్నారు. జూనియర్ కబడ్డీ రాష్ట్ర జట్లకు జిల్లాకు చెందిన వారు కెప్టెన్లుగా ఎంపిక కావడంపై జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భూలోకరావు, కర్తయ్య హర్షం వ్యక్తం చేశారు.