పాలేరుకు నీటిని తరలించుకుపోతున్నా సోయిలేని జిల్లా మంత్రులు
నల్లగొండ జిల్లా సాగర్ ఆయకట్టు ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌కు నీటిని తరలించుకెళ్తున్నా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సోయి లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు విమర్శించారు.
- మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ, జూలై 22 : నల్లగొండ జిల్లా సాగర్ ఆయకట్టు ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌కు నీటిని తరలించుకెళ్తున్నా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సోయి లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు విమర్శించారు. అక్రమంగా ఖమ్మం జిల్లాకు నీటిని తరలిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురుస్తూ కృష్ణాలో పుష్కలంగా నీళ్లున్నా, శ్రీశైలం నుంచి 1.50లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నా ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు నీళ్లు విడుదల చేయకుండా ఖమ్మం జిల్లా పాలేరు జలాశయాన్ని నింపడానికి నీటిని తరలిస్తున్నదని తెలిపారు. నల్లగొండ జిల్లాను ఎండబెట్టి ఖమ్మం జిల్లాకు ఇప్పటికి మూడుసార్లు నీటిని తరలించారని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలో తాగునీటికి కొదువ లేకపోయినప్పటికీ మన రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా తరలించుకెళ్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి నల్లగొండ జిల్లా ప్రాంతంతోపాటు మిర్యాలగూడ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

