ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
ఎప్పుడూ మూస పద్ధతిలో కాకుండా డిమాం డ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. రైతు వారోత్సవంలో భాగంగా రైతులకు వివిధ అంశాలపై బుధవారం పానగల్ రైతు వేదికలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
- రైతులకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సూచన
నీలగిరి, మే 6: ఎప్పుడూ మూస పద్ధతిలో కాకుండా డిమాం డ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. రైతు వారోత్సవంలో భాగంగా రైతులకు వివిధ అంశాలపై బుధవారం పానగల్ రైతు వేదికలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించాలని, ప్రత్యేకంగా ఆయా భూములకు అనుకూలంగా ఉన్న పంటలు పండిస్తే అధిక దిగుబడి, అధిక లాభాలు సాధించవచ్చని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియను ప్రారంభించిందని, ఆయా గ్రామాల్లోని భూములకు అనుగుణంగా పంటలు వేసేందుకు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైతే స్పెషల్ డ్రైవ్ చేపట్టి, భూముల్లోని సారాన్ని పరిశీలిస్తామన్నారు. పండిన పంటకు పూర్తిస్థాయిలో లాభం వచ్చినప్పుడే రైతు అలాంటి పంటల వైపు మొగ్గు చూపుతాడని, మారెట్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నా రు. రైతులు ఒకే పంటను పండించకుండా అన్ని రకాల పంటలు పండించాలని, ప్రస్తుత వ్యవసాయ పద్ధతులు, కొత్తగా వస్తున్న మార్పులపై దృష్టి సారించి మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా పంటలు పండించాలన్నారు.
నల్ల గొండ మేయర్ చైతన్య మాట్లాడుతూ ప్రభు త్వం రైతులకు సహకార శాఖ సొసైటీల ద్వారా అందించే పథకాలు సద్వినియో గం చేసుకోవాలన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు పథకాలపై రైతులకు అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో సదస్సుకు అధ్యక్షత వహించిన జిల్లా సహకార అధికారి పత్యా నాయక్‌తోపాటు మారెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, పీఏసీఎస్ అధ్యక్షుడు నాగరత్నంరాజు, వం గాల సహదేవరెడ్డి, మారెటింగ్ ఏడీ ఛాయాదేవి, ఎల్డీఎం శ్రామిక్, వ్యవసాయ అధికారి శ్రవణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

