గరిడేపల్లి, ఏప్రిల్ 13 : మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గోమాతలకు అప్పన్నపేట గ్రామానికి చెందిన ఎదుల్ల మోహన్ రెడ్డి ధర్మపత్ని శ్రీలత కుటుంబ సభ్యులు సొంత ఖర్చులతో ఒక ట్రాక్టర్ గడ్డిని అందజేశారు. ఈ సందర్భంగా వారు స్పందిస్తూ.. గో సేవ ఎంతో పుణ్యకార్యమని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా గోమాతలను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెండెం వెంకయ్య, దుర్గమ్మ, బండ వెంకటరెడ్డి, కారింగుల వీరస్వామి, మేకపోతుల వెంకన్న, గరిడేపల్లి గ్రామ పురోహితులు కొంపెల్లి కృష్ణయ్య, పుట్ట బక్కయ్య, మేకపోతుల పురుషోత్తం పాల్గొన్నారు.