చందంపేట, సెప్టెంబర్ 15 : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులు సోమవారం చందంపేట తాసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతులపై సీఎం రేవంత్ రెడ్డి కనికరం చూపడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఇన్చార్జి బుజ్జ చిన్న మాదిగ, శ్రీరామదాసు వెంకటాచారి, మాతంగి కాశయ్య, పచ్చిపాల కృష్ణయ్య, వెంకట్రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.