చండూరు, అక్టోబర్ 07 : మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోని ధోనిపాముల గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మండల లింగస్వామి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ మండల నాయకుడు మహమ్మద్ మహిమూద్, కాంగ్రెస్ గ్రామ కార్యకర్తలు పర్సనబోయిన సైదులు, పులకరం లింగస్వామి తదితరులు మంగళవారం బీఆర్ఎస్ మునుగోడు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వారు తిరిగి మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో చిలువేరు నరేశ్, నాగార్జున, రామాచారి, పుల్కారం సీత్తయ్య, గజనబోయిన జగన్, నాగార్జున, కోటాచారి, పరసనబోయిన మహేశ్, నీలకంఠం వెంకటయ్య పాల్గొన్నారు.
Chandur : బీఆర్ఎస్లోకి ధోనిపాముల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు