తుంగతుర్తి, మే 26 : రాజకీయాలతో సంభంధం లేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తుంగతుర్తి మెయిన్ రోడ్ పై ధర్నా నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవినీతికి పాల్పడుతూ అనర్హులను ఎంపిక చేస్తున్నట్లు ఆరోపించారు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకంలో సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు. అనంతరం ఎంపీడీఓ శేష్ కుమార్ కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేతిరెడ్డి గోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తడకమళ్ల రవికుమార్, గుడిపాటి వీరయ్య, గునిగంటి యాదగిరి, బొంకూరి మల్లేశ్, బొజ్జ సాయికిరణ్, కొండగడుపుల వెంకటేశ్, తడకమళ్ల మల్లికార్జున్, కొల్లూరి మహేందర్, పులుసు ఉప్పలయ్య, అకారపు భాస్కర్, లాకావత్ దశరథ, గోపగాని వెంకన్న, ప్రసాద్, కొండగడుపుల నాగయ్య, షేక్ జూనీ, సింహాద్రి, బెడదరాములు, పూన్య నాయక్, వీరన్న నాయక్, యాకో నాయక్, సోమేశ్, మధు పాల్గొన్నారు.
Thungathurthi : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని తుంగతుర్తిలో ధర్నా