మిర్యాలగూడ, ఆగస్టు 26 : రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో రైతులకు రూ.2 లక్షల వరకు గల రూ.42వేల కోట్ల రుణాలను మా ఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం రూ.17వేల కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసి రైతులను మోసం చేశారన్నారు.
షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీజన్ ముగుస్తున్నా ఇప్పటి వరకు రైతుభరోసా కింద నిధులను విడుదల చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీరున్నందున చెరువులు, కుంటలను నింపి చివరి భూములకు నీరందించాలని కోరారు. రైతులు పెద్ద సంఖ్యలో హజరై విజయ వంతం చేయాలని కోరారు. రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నా యకులు మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాం డు, రాగిరెడ్డి మంగారెడ్డి, వినోద్‌నాయక్, పా పానాయక్, దయానంద్, ఎల్లయ్య, రామారావు, చాంద్‌పాషా, బాషా పాల్గొన్నారు.