మిర్యాలగూడ రూరల్, జనవరి 18 : దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండలంలోని బి.అన్నారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రజా పాలన సమయంలో గ్రామంలో 215 మంది రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే.. కేవలం 47 మందితో కూడిన జాబితాను ప్రభుత్వం పంపించడం అన్యాయమన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొన్న అందరికీ రేషన్ కార్డులు వచ్చే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కూడా ఇలాగే ఉంటుందా అని ప్రశ్నించారు. ఎంపీడీఓ శేషగిరి శర్మ అక్కడికి చేరుకుని ప్రస్తుతం వచ్చింది తుది జాబితా కాదని, ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులందరికి ప్రభుత్వ పథకాల అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. ధర్నాలో వాకిటి వెంకన్న, కాతోజు వినోద్‌కుమార్, కాతోజు వినయ్ కుమార్, సింగం సత్యనారాయణ, చోగొం డి నాగరాజు, అంబటి ఉమాకాంత్‌రెడ్డి, బచ్చలికూరి పెద కోటయ్య, సుమన్, అంజి పాల్గొన్నారు.