హాలియా/నాగార్జున సాగర్, ఆక్టోబర్ 14 : సమాజంలో నెలకొన్న రుగ్మతల నివారణకు బుద్ధు డి బోధనలే శరణ్యమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సామ్రాట్ అశోక చక్రవర్తి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధ దమ్మ తీసుకున్న రోజైన ఆక్టోబర్ 14ను పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సాగర్ బుద్ధవనంలో దమ్మ విజయ వేడుకను నిర్వహించింది. ఉమ్మడి జిల్లా స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డితో కలిసి మండలి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బుద్ధ చరిత వనంలోని బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం మండలి చైర్మన్ గుత్తా మాట్లాడుతూ స్వార్థం మితిమీరి అ త్యాశ తారాస్థాయికి చేరిన నేటి సమాజంలో బుద్ధు ని పంచశీల పాటిస్తే యుద్ధాలకు తావే ఉండదన్నారు.
ఎంఎల్సీ మంకెన చినకోటిరెడ్డి మాట్లాడుతూ ఇక్షాకుల కాలంలో నాగార్జున కొండలో విరజిల్లిన బౌద్ధ్దాన్ని ప్రస్తావిస్తూ బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా మారుతున్నదని తెలిపారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ బుద్ధవనం ఆసియాలోనే అరుదైన బౌద్ధ వారసత్వ థీమ్ పార్కుగా గుర్తింపు పొందుతుందన్నారు. మోక్షానంద బౌద్ధ విహార అధ్యక్షుడు ధర్మ రక్షిత బౌద్ధ దమ్మ విజయాల గురించి వివరించారు. లతా రాజా ఫౌండేషన్ సలహాదారు పీఎస్ఎన్ మూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దమ్మ దీక్ష తీసుకున్న నేపథ్యాన్ని వివరించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, టూరిజం కార్పొరేషన్ ఎండీ, బుద్ధవనం ప్రత్యేకాధికారి ఎన్. ప్రకాశ్‌రెడ్డి, బుద్ధవనం అధికారులు సుధన్‌రెడ్డి, ఈమని శివనాగిరెడ్డి, సూర్యప్రకాశ్‌రావు, శ్యాంసుందర్‌రావు, మ హేంద్ర హిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార, మైసూర్ బైలా కుప్పేలోని మహాబోధి విహార నుం చి వచ్చిన బౌద్ధ భిక్షువులు, హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయం ఇంగ్లిష్, ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, కంది ఐఐటీ నుంచి వివిధ దేశాల విద్యార్థులు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా ఒగ్గు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా నిలిచాయి.