హుజూర్నగర్, జనవరి 5 : రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సర్పంచ్ మన్నెంశ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో మఠంపల్లి మండలంలోని అల్లీపురానికి చెందిన వివిధ పార్టీల 15మంది కార్యకర్తలు, మాజీ జడ్పీటీసీ పెండెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గరిడేపల్లి మండలంలోని వెలిదండ గ్రామ సీపీఐ సర్పంచ్ ఆదూరి పద్మాకోటయ్య ఆధ్వర్యంలో 30కుటుంబాల వారు పట్టణంలోని క్యాం పు కార్యాలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో గురువారం చేరారు.
ఈ సందర్భంగా వారి కి గులాబీ కండువాలు పార్టీలోకి సాదరంగా ఆహ్వానిచ్చారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ విజయారవి, కుక్కడపు గుర్వయ్య, కాశయ్య, మురళి, వెంక న్న, ఉపేందర్, బోగాల శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ రాజీవ్, సంజీవరావు, జయరాజు, రమేశ్, మహేశ్, రాజేశ్, గోపాలకృష్ణ, వీరబాబు పాల్గొన్నారు.