TUWJ | దేవరకొండ రూరల్ : తెలంగాణ జర్నలిస్టు ఫోరం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని జలవిహార్లో నిర్వహిస్తున్న సభకు దేవరకొండ నియోజకవర్గంలోని వర్కింగ్ జర్నలిస్టులందరూ దేవరకొండ కేంద్రం నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు కమ్మినేని ఆంజనేయులు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టుల హక్కులు, సమస్యలకై అనునిత్యం పోరాడుతున్న ఏకైక సంఘం జర్నలిస్టుల ఫోరం టీయూడబ్ల్యుజే 143 అని ఆయన తెలిపారు భవిష్యత్తులో జర్నలిస్టులు వారి యొక్క హక్కులు సమస్యలను తీర్చడం కోసం టీయూడబ్ల్యూజే 143 ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సముద్రాల వేణు, సాయి, భాను, రమేష్ చారి, మనీ మహేష్, సైదులు, రాంబాబు, విష్ణు, నారాయణ, లింగం తదితరులు పాల్గొన్నారు.