అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేసి అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొని అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు.
- దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్
కొండమల్లేపల్లి, జనవరి 4 : ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేసి అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొని అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క దరఖాస్తులోనే పథకాలకు సంబంధించిన వివరాలు ఉండడంతో అవన్నీ ఒకే సారి అమలవుతాయన్నారు.
కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణూధర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, తాసీల్దార్ దివ్వారెడ్డి, ఎంపీడీఓ బాలరాజురెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌గౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఎంఏ సీరాజ్‌ఖాన్, ఉప సర్పంచ్ గంధం సురేశ్, ఉట్కూరి వేమన్‌రెడ్డి, నాయినీ ప్రభాకర్‌రెడ్డి, అందుగుల ముత్యాలు, బక్కలయ్య, ఎంఏ ఖైసర్ఖాన్, జగదీశ్ పాల్గొన్నారు.
దరఖాస్తులన్నీ ఆన్లైన్ చేయాలి ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి
పెద్దవూర, జనవరి 4 : అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని నాగర్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కొత్తలూరు గ్రామంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజాపాలనలో తీసుకున్న ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం ఇటీవల నిడమనూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పబ్బు యాదగిరి, కొత్తలూరు సర్పంచ్ నూలక శోభారమణారెడ్డి, నాయకులు గడ్డంపల్లి వినయ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డి, కర్ణ కార్తీక్‌రెడ్డి, రమేశ్, పగడల నాగరాజు పాల్గొన్నారు.
త్రిపురారంలో..
త్రిపురారం : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి రాజ్‌కుమార్, ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ భారతీభాస్కర్నాయక్, నాయ కులు అనుముల వెంకట్‌రెడ్డి, ముడిమల్ల బుచ్చిరెడ్డి, పోతనబోయిన శ్రీనివాస్, నర్సిరెడ్డి, చిలుముల శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

కట్టంగూర్/చిట్యాల : అర్హులందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలం కల్మెర, కురుమర్తి, చిట్యాల మండలం వెల్మినేడు గ్రామాల్లో గురువారం జరిగిన ప్రజా పాలనలో మాట్లాడారు. ఆభయహస్తం పథకంతో ప్రతి ఇంటికి లబ్ధిచేకూరుతుందన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, మండల నోడల్ అధికారి విజేయేందర్రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ చిన వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ ధనమ్మ సర్పంచులు, తాసీల్దార్ దశరథ, ఎంపీటీసీ స్వరూప పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

