భువనగిరి అర్బన్, జూలై 13: ముస్లింలు మొహర్రం పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని డీసీపీ రాజేశ్చంద్ర కోరారు. పట్టణంలోని ఖాజీ మొహల్లాలోని అషుర్ఖానా, ఖిల్లా పీర్ల చావడీలను, మొహర్రం, మాతం ప్రదర్శన ఏర్పాట్లను, కర్బాలా మైదానం, పీర్ దర్గాను ఆయన శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న మొహర్రం, మాతం ప్రదర్శన సందర్భంగా భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట షియా సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రజాహుస్సేన్, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ కల్బేహుస్సేన్, నాయకులు అద్నాన్ రజా, లాయఖ్అలీ ఉన్నారు.