నార్కట్పల్లి, జూన్ 09 : పశువుల మాంసం, ఎముకలను అక్రమంగా తరలిస్తున్న డీసీఎంను పోలీసులు పట్టుకున్నారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై నార్కెట్పల్లి సమీపంలోని వేణుగోపాల స్వామి ఆర్చి వద్ద సోమవారం పోలీసులు డీసీఎంను పట్టుకున్నారు. ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తణుకు నుండి హైదరాబాద్కు లారీలో అక్రమంగా పశువుల మాంసం, ఎముకలను తరలిస్తుండగా దుర్వాసన వస్తుండడంతో స్థానిక యువకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వేణుగోపాలస్వామి ఆర్చి వద్ద లారీని ఆపి పరిశీలించగా భారీ మొత్తంలో మాంసం, బొక్కలు ఉండడంతో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని డీసీఎంను సీజ్ చేసినట్లు తెలిపారు.