యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 23 : ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత గెలుపు లాంఛనమేనని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ అన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని గొంగిడి నిలయంలో గుండాల మండలం వంగాలకు చెందిన 5వ వార్డు సభ్యురాలు చిప్పలపల్లి రేణుక, కాంగ్రెస్ యూత్ విభాగం గ్రామశాఖ అధ్యక్షుడు చిప్పలపల్లి శివకుమార్, కాంగ్రెస్ నాయకులు ఆయిలయ్య, శోభన్ మోటకొండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు తూర్పుపాటి నర్సయ్య, యాదగిరి, మల్లయ్య, ఎల్లేశ్ 200 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బీఆర్ చేరారు. వారికి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గొంగిడి మహేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ చేరుతున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎంగా కేసీఆర్ కావాలని ఎంతోమంది వివిధ పార్టీల నాయకులు బీఆర్ చేరుతున్నారన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి పథకాలు అందించిన ప్రభుత్వాలు లేవని చేరికల సందర్భంగా పేర్కొంటున్నారని తెలిపారు. పార్టీలో కొత్త, పాత తేడా లేకుండా అందరూ కలిసి బీఆర్ మరింత అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ వంగపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ జంగారెడ్డి, బీఆర్ యువజన విభాగం మండలాధ్యక్షుడు బీసు కృష్ణంరాజు, సర్పంచ్ అబ్బులు, సుధాకర్ జయమ్మ, బీఆర్ గ్రామశాఖ అధ్యక్షుడు రాజుయాదవ్, నాయకులు నక్కిర్త ఉప్పలయ్య, నర్సిరెడ్డి పాల్గొన్నారు.