మిర్యాలగూడ, ఫిబ్రవరి 6 : బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్‌సేవాలాల్(Sevalal Jayanti,) 286వ జయంతి రోజైన పిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరధ్ నాయక్ కోరారు. గురువారం మిర్యాలగూడలో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ జయంతి రోజు బంజారా ఉద్యోగ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేస్తారన్నారు.
మహాభోగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, ఆ కార్యక్రమాలకు బంజారాలు భారీ సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. కావున ఆ రోజును ప్రభుత్వం ఆధికారికంగా సెలవు ప్రకటించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవాలాల్ జయంతి వేడుకలను ఆధికారికంగా ఘనంగా నిర్వహించేందుకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బంజారా సంఘం నాయకులు మాన్యనాయక్, రవినాయక్, మోహన్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.