మేళ్లచెర్వు, మే 31 : మేళ్లచెర్వు-కోదాడ రహదారిలో మేళ్లచెర్వు పరిధిలోని కందిబండ శివారులో ఉన్న వంతెన గతేడాది చివరలో కురిసిన భారీ వర్షాలకు కూలింది. నిత్యం రద్దీగా ఉండే ఈ దారిలో వాహనాల రాకపోకలకు గాను వంతెన ప్రక్కన డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా వేసిన ఈ రోడ్డు ప్రక్కన రెయిలింగ్ లేక పోవడంతో వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇక్కడ కారు, ఆటో పడిపోవడంతో పాటు బైక్పై వస్తున్న వ్యక్తి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.