నల్లగొండ : బాబు జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితోనే తెలంగాణలో దళిత బందు పథకం అమలు చేస్తున్నారని, ఆయన సేవలు చిరస్మరణీయ దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కులరహిత సమాజం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు జగ్జీవన్‌రామ్ అని ఆయన అన్నారు.
దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత అని ఆయన కొనియాడారు. జగ్జీవన్‌రామ్ వంటి మహానీయుల ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తుంది అని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, జడ్పీటీసీ మరుపాకుల అరుణ, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేష్ గౌడ్, వైస్ చైర్మన్ రహత్ అలీ,టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, పొన్నబోయిన సైదులు, తదితరులు పాల్గొన్నారు.