కోదాడ రూరల్, జులై 11 : వానాకాలంలో పశువుల్లో వ్యాపించే వ్యాధులపై పాడి రైతులకు స్ధానిక పశు వైద్యులు అవగాహన కల్పించాలని సూర్యాపేట జిల్లా పశు సంవర్థక, పశు వైద్యాధికారి డాక్టర్ డి.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాలలో నిర్వహించిన నియోవర్గస్థాయి పశు వైద్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో ఉచితంగా పంపిణీ చేయు నత్తల నివారణ, గాలికుట్టు టీకాలపై గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలన్నారు. పశు వైద్యశాలలో మందుల కొరత లేకుండా పంపిణీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక వైద్యులు పశువుల్లో వ్యాపించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.పెంటయ్య, నియోజవర్గవ్యాప్త 11 కేంద్రాల వైద్యులు పాల్గొన్నారు.