నకిరేకల్, జూలై 14 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదినాలను పురస్కరించుకుని ఈ నెల 18న నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్ తెలిపారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన జగదీశ్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొదటి బహుమతిగా రూ.1,00,116, రెండో బహుమతిగా రూ.50,116 విజేతలకు అందజేయనున్నట్లు చెప్పారు.
నార్కట్‌పల్లి మాజీ ఎంపీపీ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. టోర్నమెంట్‌ను నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముగింపు రోజు 24వ తేదీన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిచే బహుమతుల ప్రదాన కార్యక్రమం ఉంటుందన్నారు. మాజీ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్లో ప్రతి పల్లె, పట్టణాల్లో ఉన్న యువత పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఊట్కూరి ఏడుకొండలు, వంటెపాక సుందర్, యాతాకుల సోమయ్య, చెరుకు వెంకటాద్రి, చౌగోని శంకర్‌గౌడ్, నూక సైదులు, మేకల రమేశ్, పాలడుగు ఏసు, చింతమల్ల శ్రీను పాల్గొన్నారు.