నూతనకల్, జూన్ 05 : ఈ నెల 8న సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే సీపీఐ జిల్లా నాల్గొవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ నూతనకల్ మండల కార్యదర్శి తొట్ల ప్రభాకర్‌గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసభలకు సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్న చంద్రశేఖర్ హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఈ మహాసభకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు.