– సీనియర్ న్యాయవాది మునగాల నారాయణరావు
చండూరు, సెప్టెంబర్ 20 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని సీనియర్ న్యాయవాది మునగాల నారాయణరావు ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు శనివారం నల్లగొండ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి (పోర్టు పోలియో జడ్జి) విజయసేన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్న బి.విజయ్ సేన్ రెడ్డి ఇటీవల నల్లగొండ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా బాధ్యతలు తీసుకుని మొదటిసారి నల్లగొండ కోర్టుకు విచ్చేశారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు రెవెన్యూ డివిజన్ అయినందున ఈ ప్రాంతం న్యాయవాదులందరూ కలిసి చండూరులో కోర్టు ఏర్పాటు ఆవశ్యకతను వివరించి మంజూరు చేయాల్సిందిగా కోరారు.
అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో గుర్రం వెంకటరెడ్డి, గిరి లింగయ్య గౌడ్, బొమ్మరబోయిన వెంకన్న, డోలే నర్సాజి, ఆవుల ప్రేమ్ సుందర్, మామిడి ప్రమీల, గంజి వెంకటేశ్వర్లు, భువనగిరి రవి, బరిగల నగేశ్, అయితగోని లాలయ్య గౌడ్, మోర ప్రవీణ్ కుమార్, బొమ్మరబోయిన కిరణ్, దువ్వ గీత, ఏలే వెంకటేశ్వర్లు, బొబ్బల స్వామినాథ్, గండూరి వెంకటేశ్వర్లు, జాల సంపత్ కుమార్ ఉన్నారు.