తుంగతుర్తి, జూన్ 20 : స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో తాసీల్దార్ దయానందంకు స్వర్ణకారుల సంఘం నాయకుడు పాండురంగ చారి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కొల్లోజు సంతోష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 50 ఏళ్లు దాటిన స్వర్ణకారులకు నెలకు రూ.5 వేల పెన్షన్ కల్పించాలన్నారు. అలాగే జీవో 272ను సవరించి పూర్తిస్థాయిలో అమలు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వర్ణకారుల సంఘం మండల నాయకులు పాల్గొన్నారు.