కట్టంగూర్, జనవరి 21 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అంభినందనీయమని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. కట్టంగూర్ ఉన్నత పాఠశాలకు ప్రథం ఎడ్యుకేషన్ సంస్థ ప్రతినిధులు బుధవారం డిజిటల్ కంప్యూటర్ ను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో డిజిటల్ విద్య ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కంప్యూటర్ ద్వారా విద్యార్థులు పర్యావరణ శాస్త్రం, పరిసరాల విజ్ఞానం, పెయింటింగ్ వంటి అంశాలను నేర్చుకోవచ్చన్నారు. ఇప్పటికే పాఠశాలలో ఉన్న కంప్యూటర్ల ద్వారా విద్యార్థులకు డిజిటల్ విద్యను బోధస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రియేటివ్ క్లబ్ కో ఆర్డినేటర్ తాటి మల్లయ్య, జిల్లా కోఆర్డినేటర్ వంటిపాక సంధ్య, ఉపాధ్యాయులు కొంక ఆంథోని, మహమ్మద్ గపూర్, చిన్న శ్రీనివాస్, రాణి, నీరజ, కనకదుర్గ, శ్రీదేవి, షాహేదా, జయమ్మ పాల్గొన్నారు.