భువనగిరి అర్బన్, అక్టోబర్ 17: యా దాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంలో కాంగ్రెస్‌లో లుకలుకలు బయటపడ్డాయి. అధ్యక్షుడి ఎంపికలో భాగంగా శుక్రవారం భువనగిరిలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. అభిప్రాయ సేకరణకుకు వచ్చి న ఏఐసీసీ పరిశీలకుడు సంజయ్ రౌత్ కు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి గోదాస్ పృథ్విరాజ్ వినపతి పత్రం అందజేశారు. ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, పీసీసీ కార్యదర్శిగా పని చేశానని డీసీసీ అధ్యక్షుడిగా అవకాశమిస్తే పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని తెలిపారు.
భువనగిరి పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ..పార్టీ జెండా మోసేది కార్యకర్తలైతే…. పదవులు, నామినేటెడ్ పదవులు పొందేది వేరే నాయకుల వంతు అవుతుందని, కనీసం పార్టీ తరఫున కార్యకర్తలకు ఏ అవకాశాలు ఇచ్చారని డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డిని నిలదీశారు. కార్యకర్తల కష్టం లేనిదే భువనగిరిలో కాంగ్రెస్ అధికారంలో ఎలా వచ్చిందని ధ్వజమెత్తారు. భువనగిరి పట్టణ నాయకులకే డీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని ఏఐసీసీ పరిశీలకుడు సంజయ్ రౌత్‌ను కోరారు. పట్టణ నాయకులకే పదవి ఇవ్వాలని, లేకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల అయిలయ్య, అండెం సంజీవ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.