నల్లగొండ, మార్చి 15 : సాంకేతిక విజ్ఞానం పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులు మోసపోకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురసరించుకొని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోనిర్వహించిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సంవత్సరం కృత్రిమ మేధస్సు-జాగ్రత్తలు సమస్యలు అనే అంశంపై ప్రపంచ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వర్రావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఫుడ్ కమిటీ సభ్యులు సంధ్యారాణి, జిల్లా మారెటింగ్ అధికారి శ్రీకాంత్, జిల్లా వినియోగదారుల సంఘం సభ్యులు గురువయ్య, కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ కోపరేటివ్ ప్రెసిడెంట్ హిమగిరి పాల్గొన్నారు.