Consumer Protection Act | మిర్యాలగూడ, ఫిబ్రవరి 25 : గ్రామీణ ప్రాంతాలకు వినియోగదారుల రక్షణ చట్టం-2019ను తీసుకెళ్లడానికి వినియోగదారుల సంఘాలు కృషి చేయాలని నల్గొండ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. ఇవాళ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుడు వస్తువులు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలని, ధరలు, తూకంతోపాటు నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసి.. కొనుగోలు చేసిన వస్తువుకు తప్పనిసరిగా బిల్లును తీసుకోవాలన్నారు. వినియోగదారులు కొనుగోలు చేసిన వాటిలో ఏమైనా మోసాలున్నా, సమస్యలున్నా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి న్యాయం పొందవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రతిస్పందన వినియోగదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చేతిరాల సాంబశివరావు, నల్గొండ జిల్లా వినియోగదారుల సంఘాల అధ్యక్షుడు హిమగిరి, ఏల వెంకటేశ్వర్లు, గురువయ్య, పూర్ణచంద్రరావు, గొల్ల రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Srisailam | శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ ప్రవీణ్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!