నార్కట్‌పల్లి జూన్ 19 : ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన హరితహారంతోనే ఆకుపచ్చ తెలంగాణ సాధించారని జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు.రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో స్థానిక పట్టణ కేంద్రంలో శబరి గార్డెన్లో నియోజకవర్గ స్థాయి హరితోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా రాశి రిఫ్రాక్టరీ కంపెనీ పక్కనున్న వెంచర్లలో మొక్కలు నాటి ర్యాలీగా తిరిగి వచ్చారు. అనంతరం జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి సారధ్యంలో గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి ఆకు పచ్చ గ్రామాలుగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే హరితహారం రాష్ట్రంలో విజయవంతమైందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారి రాంబాబు ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షులు యానాల అశోక్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.శాలిగౌరారం : మండల వ్యాప్తంగా సర్పంచులు, అధికారులు, ప్రజలు ర్యాలీ నిర్వహించి మొక్కలను నాటి నీళ్లుపోశారు. ఆయా కార్యక్రమాల్లో బండారు శంకరయ్య, ఇంతియాజ్, అధికారులు పాల్గొన్నారు.
నకిరేకల్ : మండలంలోని నోముల గ్రామ హరితోత్సవంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని గ్రామపంచాయతీ నుండి వైకుంఠధామం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైకుంఠధామంలో మొక్క నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, ఎంపీడీఓ అండాలు, ఎంపీఓ నాగలక్ష్మీ, ఏపీఓ రమణయ్య, స్పెషల్ అధికారి మల్లేశ్, కార్యదర్శి రమేశ్, నాయకులు ఆలకుంట్ల సైదులు, వీర్లపాటి రమేశ్, జంగయ్య, ఎండీ ఖాసీంఖాన్, వెల్మకంటి జానయ్య పాల్గొన్నారు.
కట్టంగూర్ : మండల వ్యాప్తంగా హరితోత్సవం నిర్వహించారు. కట్టంగూర్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు ర్యాలీగా నిర్వహించి నర్సరీలు, పల్లెప్రకృతి వనాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, ఎంపీటీడీఓ పోరెళ్ల సునీత, ఎంపీఓ మహ్మద్ అథర్ పర్వేజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పోగుల నర్సింహ, ఏపీఓ కడెం రాంమోహన్, ఏపీఎం చౌగోని వినోద, సర్పంచులు పాల్గొన్నారు.
చిట్యాల : చిట్యాలలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా నిర్వహించారు. రైతువేదిక సమీపంలోని నర్సరీలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, కమీషనర్ మందడి రాందుర్గారెడ్డి, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, జిట్ట పద్మ, బెల్లి సత్తయ్య, రుద్రవరం పద్మ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెండె సైదులు, నాయకులు పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్, గంట శ్రీనివాస్‌రెడ్డి, శీల సత్యనారాయణ, రంగ వెంకన్న, ప్రవీణ్ పాల్గొన్నారు.