కోదాడ, ఆగస్టు 12 : నడిగూడెం మండల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు విధుల నుండి సస్పెండ్ అయ్యాడు. మైనర్‌ను వివాహం చేసుకున్నందుకు గాను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ నర్సింహ ఉత్తర్వులు జారీ చేశారు. చివ్వెంల మండలానికి చెందిన నాగరాజు ఇప్పటికే మాయమాటలు చెప్పి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇందులో ఒక బాలిక కూడా ఉన్నది. ఇక ఐదో పెండ్లికి సిద్ధమవుతుండగా విశ్వసనీయ సమాచారం తెలిసిన ఎస్పీ నరసింహ విచారణకు ఆదేశించారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నది వాస్తవమేనని తేలడంతో కానిస్టేబుల్ నాగరాజును ఎస్పీ సస్పెండ్ చేశారు. అయితే సదరు కానిస్టేబుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.