నీలగిరి, సెప్టెంబర్ 15: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ సూల్ విధానం ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని, బోధన బాధ్యతను అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించాలని, ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేస్తూ ఒకే ఆన్లైన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, 5 జి నెట్వర్ కలిగిన మొబైల్ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంగన్వాడీల వేతనం 18 వేలు, పీఎఫ్ అమలు చేయాలని, మంత్రి హామీ మేరకు 24 రోజుల సమ్మె కాల వేతనాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ జీవో నం. 8ను సవరించి పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అమలు చేయాలని కోరారు.
అంగన్వాడీల సమస్యల పరిషా రం కోసం దశలవారీగా పో రాటాలు చేస్తామని, అందు లో భాగం గా సెప్టెంబర్ 25 న చలో సెక్రటేరియట్ నిర్వహిస్తున్నామన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా హైదరాబాద్కు తరలిరావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 8న రాష్ట్ర వ్యాప్త సమ్మె, జిల్లా కేంద్రాల్లో 5 కిలోమీటర్లు పాదయాత్రలు చేపట్టాలని,17 నుంచి ఆన్లైన్ సమ్మె నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినందున నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.