కోదాడ, మార్చి 20 : రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించినందున రానున్న స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి చావు దెబ్బ తప్పదని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయీం అన్నారు. గురువారం సూర్యాపేటలో నిర్వహించిన కేటీఆర్ సమావేశానికి బయల్దేరే ముందు కోదాడలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఆయన మాట్లాడారు.
బడ్జెట్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు దోఖా చేసిందన్నారు. సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. ఇప్పటికే కోదాడ నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి ఏర్పడిందని, సమస్యను విన్నవించినా నివారణకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. పట్టణంలో సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిట్టల భాగ్యమ్మ, హనుమాన్ నాయక్, లలిత, చలిగంటి వెంకట్, నరసయ్య, బాలకృష్ణ గౌడ్, రాజేశ్, తిరుపతయ్య, రమేశ్, వీరన్న పాల్గొన్నారు.