నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. ప్రభుత్వ వైఫత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కట్టంగూర్, అక్టోబర్ 29 : నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. ప్రభుత్వ వైఫత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గురువారం కట్టంగూర్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్లగొండ- ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించి విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పని చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ న్నికల్లో ప్రతి ఓటు కీలకమని, అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా చేసుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఓటరు నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించే విజయం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
మరో ఏడాదిన్నరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాలు ఎంతో కీలకంగా మారనున్నాయని, అందువల్ల ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. పట్టభద్రుల ఓటు నమోదుపై గ్రామాల వారిగా సమీక్ష నిర్వహిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. నకిరేకల్ నియోజకవర్గంలో పట్టభద్రులు ఓటు నమోదుకు భారీ స్పందన లభిస్తుందని ఇదే ఊపుతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి ఓటు కేసీఆర్ కే వేసినట్లు భావించి ఆయన నిలబెట్టిన అభ్యర్థి రాకేశ్రరెడ్డిని భారీ మెజార్జిటీతో గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ్మ, సర్పంచ్ వడ్డె సైద్దిరెడ్డి, బెల్లి సుధాకర్, ఇప్పలపల్లి అనితాశ్రీను, నాయకలు దాసరి సంజయ్ కుమార్, పెద్ది బాలనర్సయ్య, గుండగోని రాములు, బీరెల్లి ప్రసాద్, పెద్ది మల్లేష్, పులిగిల్ల వెంకన్న, పులిగిల్ల సైదులు, రేకల సాయి, మునుగోటి ఉత్తరయ్య, గాజుల బుచ్చమ్మ, నోముల వెంకటేశ్వర్లు, చౌగోని జనార్దన్, మంగదుడ్ల వెంకన్న, పోగుల సాయికుమార్, చింత నాగార్జున, పోగుల నర్సింహ్మ, జిల్లా యాదయ్య, ఎరుకల శ్రీను పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kidney health | కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..!
నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Harish Rao | మల్లన్నసాగర్‌కు అతీ సమీపంలో బ్లాస్టింగ్లు.. ప్రమాదంలో రిజర్వాయర్ : మాజీ మంత్రి హరీష్‌రావు ఆందోళన
Bigg Boss | బిగ్ బాస్ హౌస్‌లో ఇన్ని ఇబ్బందులా .. షో వెనుక అసలు విషయాలు బయటపెట్టిన దక్షి!
టేకులపల్లిలో కటారుసుం వేలం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

