– తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి
– మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలి
– మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, ఫిబ్రవరి 06 : ఆరు గ్యారంటీలతో పాటు అమలుకు నోచుకోని 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మిర్యాలగూడ పట్టణ ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేలా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని కోరారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని 37, 19, 38, 46, 47 వార్డుల్లో వారు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం అన్నారు. మన ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన రేవంత్ సర్కారుకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని వార్డు ప్రజలను కోరారు.
మిర్యాలగూడ పురపీఠంపై గులాబీ జెండా ఎగురవేయాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్దే తమ అభ్యర్థుల గెలుపునకు దోహద పడుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, మిత్రపక్షాల (బీఆర్ఎస్ – సీపీ ఐ(ఎం)) అభ్యర్థులను బంపర్ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, యువనేత నల్లమోతు సిద్దార్ధ, దుర్గంపూడి నారాయణ రెడ్డి, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, రేడబోతు సంతోష్ రెడ్డి, నందకిషోర్, కందుల నాగిరెడ్డి, స్థానిక అభ్యర్థులు జన్నపాల సునీత కిరణ్, లావురి అరుణ సుధాకర్, చిమట వెంకటరామయ్య, అలుగుబెల్లి నాగరాజు, అంజి, వినోద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

‘కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలి’