సూర్యాపేట, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : ‘ గత ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచాను.. నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు.. నా డబ్బులు నేను రాబట్టుకోవాల్సిందే.. ఎవ్వరు డబ్బులు ఇవ్వకున్నా వాడిని ఇడిశేదే లేదు’ అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్చల్ చేస్తుంది.
ఇప్పటికే సొంత పార్టీ నేతలతో పొసగక నెలకు ఒకసారి ఎమ్మెల్యేను సొంత పార్టీ నేతలు తూర్పారబట్టడం.. ఇసుక, కాంట్రాక్టులన్నీ ఎమ్మెల్యే కుటుంబమే చేసుకుంటూ పార్టీ కోసం కష్టపడిన వారిని కనీసం పట్టించుకోవడం లేదంటూ రోడ్డెక్కి మరీ ఆరోపణలు చేస్తుండగా తాజాగా మరో వివాదంలో ఎమ్మెల్యే సామేల్ ఇరుక్కున్నారు. లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే మామూళ్లు అంటూ ఓ వీడియో వైరల్ అవుతున్నది. వైన్స్ యజమానులతో ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఎమ్మెల్యే సామేల్‌తో బేరసారాలాడుతూ లిక్కర్ మాఫియా స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే మామూళ్ల వ్యవహారం బయటపెట్టాలనే ఉద్దేశంతోనే సీక్రెట్ కెమెరాతో సిండికేట్ మాఫియా ఆపరేషన్ చేసిందని ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా రికవరీ కావాలి. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. డీజిల్‌కు కూడా డబ్బులు లేవు.. ప్రభుత్వం ఇచ్చే జీతం కొసరు అవుతలేదు… మీరిచ్చే మామూలు నాకు టీ ఖర్చులకు కూడా సరిపోవు.. అంటూ తన మాట వినని వాళ్ల సంగతి చూస్తాననని వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే సామేల్ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
కెమెరాకు చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల వసూళ్ల దందా
లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మామూళ్ళ వసూలు
వైన్స్ యజమానులతో ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్న మందుల సామెల్
ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా రికవరీ కావాలి, మళ్ళీ… pic.twitter.com/1aslsGLIys
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2025