పెన్పహాడ్, అక్టోబర్ 08 : స్థానిక సంస్థల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డులు చూపించి నిలదీయాలని సూర్యాపేట జిల్లా తెలంగాణ వికాస్ సమితి అధ్యక్షుడు బిట్టు నాగేశ్వరరావు అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధిలోని ధూపహాడ్ గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ ధూపహాడ్ గ్రామాధ్యక్షుడు జడ వీరయ్య, మాజీ సర్పంచులు తురక భద్రయ్య, గుగ్గిళ్ల సోమయ్య, పలువురు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల జాడే లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 50 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి అందులో కూడా 17వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు.
మహిళలకు రూ.2,500 మొదటి నెల నుంచి ప్రారంభిస్తామని చెప్పారని ఇప్పటివరకు ఒక్కో మహిళకు 55 వేల బాకీ పడ్డారన్నారు. మొత్తం ఆసరా పెన్షన్దారుకు రూ.44 వేలు, ఆటో కార్మికులకు రూ.24 వేల బాకీ పడ్డట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల ప్రేమ్ కుమార్, హుస్సేన్, కత్తి ఉపేందర్, మాతంగి అరవింద్, జిల్లా శ్రీను, నన్నెపంగా గురవయ్య, మద్దెల సతీశ్, చిలక ఆదెమ్మ, ఎరుకల సైదయ్య, అరవిందు, దొంగరి రామయ్య, మల్లెపల్లి రామయ్య, కొప్పోలు రంగమ్మ, ఎరుకల అచ్చమ్మ, మసనం నిఖిల్, కత్తి మహేశ్, గోకని సాంబాయమ్మ పాల్గొన్నారు.