‘కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు’
చేవెళ్ల డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అభయహస్తం పథకం కింద రూ.12 లక్షలు వెంటనే అందజేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కోదాడ పట్టణంలో నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి నాగరాజు మాదిగ...
– ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ
కోదాడ, అక్టోబర్ 29 : చేవెళ్ల డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అభయహస్తం పథకం కింద రూ.12 లక్షలు వెంటనే అందజేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కోదాడ పట్టణంలో నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా ఇన్చార్జి ముక్కంటి మాదిగతో కలిసి మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ బలోపేతానికి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలు వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంబేద్కర్ అభయ హస్తం పథకం అమలకు కార్యాచరణ రూపొందించాలని కోరారు. లేనిపక్షంలో మాదిగల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మేళ్లచెరువు ముక్కంటి ఆధ్వర్యంలో మండల కమిటీలను నియమించారు. కోదాడ మండల ఇన్చార్జి నార్కట్ల ప్రసాద్ మాదిగ, అనంతగిరి మండల ఇన్చార్జి కొత్తపల్లి శ్రీనివాస్ మాదిగ, చిలుకూరు మండల ఇన్చార్జి బొల్లె పోగు రాజేష్ మాదిగ, మునగాల మండల ఇన్చార్జి లంజపల్లి శ్రీనివాస్ మాదిగ, నడిగూడెం మండల ఇన్చార్జి కొత్తపల్లి నరహరి మాదిగ, మోతే మండల ఇన్చార్జిగా కత్తుల రవి మాదిగను నియమించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బాణాల అబ్రహం మాదిగ, జిల్లా కార్యదర్శి బొల్లె పోగు స్వామి మాదిగ, నియోజకవర్గ నాయకుడు పిడమర్తి బాబురావు, పట్టణ అధ్యక్షుడు ఏర్పుల చిన్ని మాదిగ, బేడా బుడగ జంగాల అధ్యక్షుడు సంకుల ముత్తయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు’
cow slaughter case | గోవధ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు.. హిందూ గ్రంథాలను ప్రస్తావించిన గుజరాత్ కోర్టు
‘టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో ఎంపీ వద్దిరాజు
స్ట్రోక్ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

