‘రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం’
దళారీ వ్యవస్థకు వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం చిలుకూరు మండల కేంద్రంలో పర్యటించి, రైతుల పంటను, కొనుగోలు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
– పంట నష్ట పరిహారం అందించలేని దుస్థితి
– రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన
– నష్టపోయిన పంటలను రైతులతో కలిసి పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, నవంబర్ 10 : దళారీ వ్యవస్థకు వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం చిలుకూరు మండల కేంద్రంలో పర్యటించి, రైతుల పంటను, కొనుగోలు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం శ్రమించి వరి సాగు చేశారని, అయితే ప్రభుత్వం నుండి రైతులకు కనీస సహాయం అందలేదన్నారు. రైతుబంధు ఇవ్వలేదని, సకాలంలో సాగునీరు, విద్యుత్తు అందించలేదన్నారు. యూరియా కూడా సరఫరా చేయలేని అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు.
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తేమ పేరుతో దళారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. తూకం, తాలు పేరుతో బస్తాకు రెండున్నర కిలోల చొప్పున అదనంగా కోత విధిస్తూ వ్యాపారస్తులు రైతులను మోసం చేస్తున్నారన్నారు. నిన్నటి వరకు రూ. 4,200 ఉన్న ధాన్యం ధరను, నేడు రూ. 3,200 లకు తగ్గించారని విమర్శించారు. క్వింటాకు ఏకంగా వెయ్యి రూపాయలు తగ్గించి రైతుల పొట్ట కొడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ఒకవైపు రైతుకు కనీస మద్దతు ధర దక్కడం లేదని, మరోవైపు మార్కెట్లో బియ్యం ధరలు చుక్కలను అంటుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కిలో బియ్యం ధర రూ. 90 దాటిపోవడంతో సామాన్యులు, కూలీలు బియ్యం కొనుక్కోలేని దయనీయ పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి అండదండలతోనే ఈ బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా కొనసాగుతోందని, అధికారులు కేవలం కాగితపు ప్రకటనలకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు.

‘రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం’
ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని, వరి వేయవద్దని చెప్పిన ప్రభుత్వ మాట విని పొలాలను పడావు పెట్టిన రైతులకు ఇంతవరకు ఎలాంటి కరువు భత్యం అందలేదన్నారు. కరువు మండలాలుగా ప్రకటించినా నయా పైసా సాయం చేయలేదని, తుఫానుల వల్ల దెబ్బతిన్న పొలాలకు నష్టపరిహారం అంచనా వేయలేదన్నారు. కేంద్ర బృందాలు పరిశీలించిన దాఖలాలు లేవని, దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. తక్షణమే రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని, దళారుల దోపిడీని అరికట్టి రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం’
Sonia Gandhi | ‘నాడు మేనక చెప్పిన ఆ అబద్దం నన్ను చాలా బాధించింది’.. ఆత్మకథలో సోనియాగాంధీ వెల్లడి
‘మైనారిటీ సంక్షేమ దినోత్సవం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం’
Ghatkesar Bus stand | ‘నీళ్లు లేవు.. రేపు రాగలరు’.. ఇంతకీ ఈ బోర్డు ఎక్కడ పెట్టారో తెలుసా..?
‘గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

