Sonia Gandhi | ‘నాడు మేనక చెప్పిన ఆ అబద్దం నన్ను చాలా బాధించింది’.. ఆత్మకథలో సోనియాగాంధీ వెల్లడి
Sonia Gandhi | గాంధీ-నెహ్రూ కుటుంబంలో చిన్న కోడలైన మేనకాగాంధీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబానికి దూరంగా ఉన్నారు. ఎప్పుడూ సోనియాగాంధీ కుటుంబంతో కలువలేదు. ఈ క్రమంలో సోనియాగాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్ (Belonging : A Journey of Love)’ లో తోడికోడలు మేనకాగాంధీ (Maneka Gandhi) గురించి పలు విషయాలు పంచుకున్నారు.
Sonia Gandhi : గాంధీ-నెహ్రూ కుటుంబంలో చిన్న కోడలైన మేనకాగాంధీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబానికి దూరంగా ఉన్నారు. ఎప్పుడూ సోనియాగాంధీ కుటుంబంతో కలువలేదు. ఈ క్రమంలో సోనియాగాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్ (Belonging : A Journey of Love)’ లో తోడికోడలు మేనకాగాంధీ (Maneka Gandhi) గురించి పలు విషయాలు పంచుకున్నారు. నాటి కుటుంబ వివాదాలు, తదనంతర రాజకీయ పరిణామాలు ‘రియాలిటీ షో’ ను తలపించాయని సోనియా పేర్కొన్నారు.
ఆత్మకథలో సోనియాగాంధీ ఏం రాశారో ఆమె మాటల్లోనే.. ‘1973లో మేనక గాంధీకి (Maneka Gandhi) సంజయ్ గాంధీకి మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె ఒక అందమైన, చురుకైన అమ్మాయి. సంజయ్ కంటే పదేళ్లు చిన్నది. అప్పటికి ఇంకా మైనరే. ఒక ఏడాదిలో వారి పెళ్లి అయింది. 18 ఏళ్ల ఆ అమ్మాయి గాంధీ కుటుంబంలో భాగమైంది. ఉత్సాహంగా ఉండే తోడికోడలు రావడంతో మొదట్లో ఇల్లంతా ఆహ్లాదంగా అనిపించింది. రానురాను చికాకులు మొదలయ్యాయి. ఆమె ఎప్పుడైనా కఠినంగా మాట్లాడినా ఇంట్లో ప్రశాంతత పోకూడదని మౌనంగా ఉండేదాన్ని. కానీ ఆ మాటల స్థాయి దాటితే మాత్రం సూటిగా సమాధానం చెప్పేదాన్ని’ అని తెలిపారు.
‘సంజయ్, మేనకకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ విభేదాలు త్వరలోనే కుటుంబసభ్యులకు తెలిసిపోయాయి. రాజకీయ కార్యక్రమాలకు వేడుకలకు సంజయ్‌తోపాటు వెళ్లడం మొదలుపెట్టాక మేనక కాస్త కుదురుకున్నట్లు కనిపించింది. కానీ సంజయ్‌పై మేనక ప్రభావంతో సోదరుల మధ్య సంబంధాలు దెబ్బతింటూ వచ్చాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్న రాజీవ్‌గాంధీ, సంజయ్ గాంధీ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి’ అని సోనియాగాంధీ వెల్లడించారు. 1978 ఎన్నికల్లో విపత్కర ఓటమికి సంజయ్‌గాంధీ కూడా ఓ కారణమని రాజీవ్ అనడంతో కుటుంబంపట్ల మేనకకు ద్వేషం పెరిగిందని పేర్కొన్నారు.
‘అమ్మకు ఈ పరిస్థితి తీసుకువచ్చిన నిన్ను క్షమించలేను సంజయ్’ అని కుటుంబ చర్చలో భాగంగా రాజీవ్‌గాంధీ అన్నారు. దాంతో మేనకాగాంధీ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిందని, కానీ ‘కాదని చెప్పగలవా..?’ అంటూ అత్తమ్మ గట్టిగా అడిగేసరికి ఆమె వెనక్కి తగ్గిందని తెలిపారు. ముఖ్యంగా తనను, రాజీవ్‌గాంధీని మేనకాగాంధీ శత్రువులుగా చూసేదని వెల్లడించారు. తనకు టచ్‌లో ఉన్న కొందరు పాత్రికేయులతో తమ గురించి అవాస్తవ ప్రచారం చేసేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను, రాజీవ్‌గాంధీ దేశం విడిచి పారిపోవాలని అనుకున్నామన్నది పచ్చి అబద్ధం ఆ వార్తే మమ్మల్ని ఎక్కువ బాధపెట్టిందని తెలిపారు.
‘1980 జూన్ 23న జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ మరణించిన తర్వాత కుటుంబంతో ఆమె సంబంధాలు మరింత క్షీణించాయి. మేనకకు ఏదైనా రాజకీయ పదవి ఇవ్వాలని మేనక తల్లి సంజయ్ వర్గానికి చెందిన నేతలను అడిగినట్టు తెలిసింది. కానీ అప్పటికి మేనక వయసు 23 ఏళ్లు. ఆమెది చిన్నవయసు అని ఇందిర భావించారు. అంతేగాకుండా మూడునెలల పిల్లాడు కూడా ఉన్నాడు. తన రాజకీయ ఆకాంక్షలు నెరవేరడానికి తగిన సమయం ఉందని అత్తమ్మ అనుకున్నారు. కానీ మేనక ఆలోచన వేరుగా ఉందని తర్వాత అర్థమైంది’ అని సోనియా వెల్లడించారు.
‘మేనక కుమారుడు వరుణ్ గాంధీ తొలి పుట్టినరోజు సమయంలో విభేదాలు తీవ్రమయ్యాయి. ఆర్ఎస్ఎస్ మద్దతుదారు, తన ప్రత్యర్థి అయిన వసుంధరా రాజే ఇంట్లో తన మనవడి పుట్టినరోజు వేడుకలు జరిగాయని తర్వాత ఇందిరాగాంధీకి తెలిసింది. అంతేగాకుండా తన ఆధ్వర్యంలోని ‘సూర్య’ మ్యాగజైన్‌ను ఆర్ఎస్ఎస్ సభ్యుడు ఒకరికి విక్రయించింది. అందుకు రాజే సహకారం అందించారు. ఈ చర్యలతో మేనక అన్ని పరిమితులు దాటేశారు. ఇందిరాగాంధీ లండన్‌లో అధికారిక పర్యటనలో ఉన్నప్పుడు మేనక తన సామాన్లను ఇంటి నుంచి తీసుకెళ్లిన విషయం ఆమెకు తెలిసింది’ అని పేర్కొన్నారు.
ఇందిర తిరిగి వచ్చిన తర్వాత మేనకను మందలించారని, ‘నువ్వు ఇక నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి పనులకు దూరంగా ఉండటమా లేక వేరేచోట నివసించడమా తేల్చుకోవాలి’ అని స్పష్టంగా చెప్పారని సోనియా తెలిపారు. ఇంటి నుంచి వెళ్లగొట్టిందన్న నింద అత్తమ్మ మీద మోపాలని మేనక నిర్ణయించుకున్నట్లు వెల్లడైందని ఆమె పేర్కొన్నారు. అత్తమ్మతోపాటు రాజీవ్‌ను, తనను నిందించిందని, అదంతా జరిగిన తీరు ఒక రియాలిటీ షోను తలపించిందని తెలిపారు. తర్వాత మనవడిని చూసే హక్కుల కోసం గాంధీ కుటుంబం న్యాయపరమైన పోరాటం చేసిందన్నారు.
ఆ కేసు జరుగుతున్నప్పుడే వరుణ్ నాలుగో పుట్టినరోజు వచ్చిందని, అదే సమయంలో పంజాబ్‌లో కల్లోల పరిస్థితులను అత్తమ్మ ఎదుర్కొంటున్నారని సోనియా తెలిపారు. దాంతో వరుణ్‌కు బహుమతులు ఇవ్వాలని తనకు చెప్పారని, కానీ తర్వాత రోజు వార్తాపత్రికల్లో కథనాలు ఆశ్చర్యపర్చాయని పేర్కొన్నారు. తాను వరుణ్‌ను కిడ్నాప్ చేయడానికి యత్నించానని మేనక ఆరోపించిందని, దాంతో వారి లాయర్‌కు 1984 ఏప్రిల్ 19న అత్తమ్మ సమాధానం ఇచ్చారని వెల్లడించారు. అదే చివరి సమాధానమని, ఆపరేషన్ బ్లూస్టార్‌కు రెండు నెలల ముందు ఇది జరిగిందని సోనియా తన ఆత్మకథలో రాసుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ‘నాడు మేనక చెప్పిన ఆ అబద్దం నన్ను చాలా బాధించింది’.. ఆత్మకథలో సోనియాగాంధీ వెల్లడి
‘మైనారిటీ సంక్షేమ దినోత్సవం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం’
Ghatkesar Bus stand | ‘నీళ్లు లేవు.. రేపు రాగలరు’.. ఇంతకీ ఈ బోర్డు ఎక్కడ పెట్టారో తెలుసా..?
‘గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా’
‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

