శాలిగౌరారం, అక్టోబర్ 9: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ బాకీ కార్డులను ప్రతి గడపకూ చేరవేసే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు అమలు చేయకపోవడంతో, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటికీ బాకీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు.
కాంగ్రెస్ చేసిన మోసాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మాటలు నమ్మి జనం మోసపోయారన్నారు. ప్రభుత్వానికి బుద్ధి ఉంటే ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సోషల్ మీడియాలో పొస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదన్నారు. 22నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు వివరించాలన్నారు.
అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్, మండల ప్రధానకార్యదర్శి చాడ హతీష్‌రెడ్డి, కట్టా వెంకట్‌రెడ్డి, గుండా శ్రీనివాస్, మామిడి సర్వయ్య, గుజిలాల్ శేఖర్‌బాబు, జెర్రిపోతుల చంద్రమౌళీగౌడ్, దుబ్బ వెంకన్న, పాక యాద య్య, మామిడి రమేశ్, దాసరి వెంకన్న, భూపతి ఉపేందర్, అంబాల కృష్ణమూర్తి గౌడ్, పాక రాములు, మహేశ్వరం వెం కన్న, నిమ్మల సురేశ్ గౌడ్, బైరు నాగరాజుగౌడ్, యామగాని వెంకన్న, కమలాకర్, అంకర్ల పున్నమి నాగులు, మెట్టు నగేశ్, చెవుగాని అశోక్, తీగల వెంకన్న, రవి, గోపి పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిక…
వల్లాల, పెర్కకొండారం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలు కిశోర్‌కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కాకముందే జనం అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ర్టాన్ని రైతు రాజ్యంగా మారిస్తే..కాంగ్రెస్ పాలనలో రైతులను రోడ్డెక్కించిన ఘనత రేవంత్‌రెడ్డికి దక్కిందన్నారు.