తుంగతుర్తి, అక్టోబర్ 27 : అధికారం కోసం ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు కూరగాయల సంతలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన ఆరు గ్యారంటీలో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని, ప్రజలను నమ్మించి మోసం చేసిందని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తునికి సాయిలు, గోపాగాని రమేశ్, గునిగంటి యాదగిరి, కోరుకొప్పుల వెంకన్న, గడ్డం సోమేశ్, షేక్ జూనీ, కేతావత్ శంకర్ నాయక్, అకారపు భాస్కర్, చల్ల రమేశ్, గోపాగాని వెంకన్న పాల్గొన్నారు.