సూర్యాపేట, అక్టోబర్ 13: ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం అన్ని రంగాల్లో విఫలమై ప్రజలను నిలువునా దగా చేసిందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపు మేరకు సోమవారం సూర్యాపేటలోని 46వ వార్డులో బీఆర్ఎస్ నాయకుడు అంగోతు బావ్‌సింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేశారు.
ఈ సం దర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ 22 నెలల కాంగ్రెస్ పానలలో ఏ ఒక్క రంగమూ బాగుపడలేదన్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, రైతుకూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను హామీల పేరుతో మోసం చేసిందన్నారు. ప్రధా న ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయించాల్సిన బాధ్యత బీఆర్ఎస్పై ఉందన్నారు. అందులో భాగంగానే ప్రజలకు బాకీ పడ్డ కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నామన్నారు. కార్డుల్లో కొన్ని బాకీలు మాత్రమే చేర్చామని, అమలుకు నోచుకోని ఇంకా ఎన్నో హామీలు ఉన్నాయన్నారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు, వికలాంగులు, వృద్ధుల పెన్షన్లు పెంచకుండా బాకీ పడ్డారని అన్నారు.
దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని బాకీలు చెల్లించే వరకు బీఆర్ఎస్ ప్రజల వెంటే ఉండి, హామీల అమలుకు పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ రియాజుద్దీన్, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, బి.రాజా, అంగోతు బావ్‌సింగ్, మ ద్దూరి సుధాకర్, రాములు, సాగర్, దేవేంద్రాచారి, కృష్ణారెడ్డి, రజిని, అనూష, ఉపేంద్ర పాల్గొన్నారు.