పెన్పహాడ్, అక్టోబర్ 18 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ పెన్పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యూగేందర్ అన్నారు. శనివారం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో దోబూచులటలాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామన్నారు. కాంగ్రెస్ బీసీలకు రిజర్వేషన్లను కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సమగ్ర కులగణనను మొదలుకుని బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి పంపించడం, ఆ బిల్లు పెండింగ్ లో ఉండగానే మరో ఆర్డినెన్స్ తేవడం, ఆ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే జీఓ 9ని తీసుకురావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఘోర తప్పిదమన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం 5 శాతం ఉన్న రెడ్డిలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు మిర్యాల వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు తూముల ఇంద్రసేన రావు, బొల్లాక బొబ్బయ్య, మాజీ సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు, మీసాల లింగయ్య, కొండా జానకి రాములు, సుధాకర్, యగ్గడి మురళి, నర్సయ్య, మీసాల లచయ్య, దారవత్ లక్ష్మణ్, మేకల శ్రీనివాస్, యాళంలా జగన్, కొన్నే వెంకట్, రణపంగ సైదులు పాల్గొన్నారు.