రామగిరి, అక్టోబర్ 08 : నిత్య యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ హరీశ్ కుమార్ అన్నారు. యూనివర్సిటీ ఇంటర్ కళాశాల టోర్నమెంట్ (ఐసీటీ) పోటీల్లో భాగంగా ఈ నెల 7, 8న వర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన పురుషుల, మహిళాల యోగాసన పోటీలు బుధవారం సాయంత్రం ముగిశాయి. పోటీల్లో ఎంజీయూతో పాటు అనుబందంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను యూనివర్సిటీ టీంకు ఎంపిక చేశారు. పురుషుల్లో ఎంపికైన వారికి నవంబర్ 10న తమిళనాడులోని వేల్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో జరిగే అంతర యూనివర్సిటీ క్రీడా పోటీలు (ఐయూటీ) ఉంటాయన్నారు. అదే విధంగా మహిళలు సవ్యస యూనివర్సిటీ బెంగూళూర్‌లో జరిగే పోటీలకు హాజరవనున్నట్లు హరీశ్‌కుమార్ తెలిపారు.
యూనివర్సిటీ నుంచి జాతీయ స్థాయిలో జరిగే పోటోల్లో హాజరయ్యే విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి ఎంజీయూ ఖ్యాతిని చాటాలని కోరారు. విద్యతో పాటు ప్రత్యేక క్యాలెండర్ తో యూనివర్సిటీలో క్రీడలు నిర్వహిస్తున్నామని వీటిలో సైతం విద్యార్థులు భాగస్వామమై తమ ప్రతిభ చూపాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు వీసీ ప్రొ॥ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ప్రొ॥ అల్వాల రవితో పాటు వివిధ విభాగాల అధికారులు అభినందనలు తెలిపారు. ఈ పోటీల్లో ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డా.వై.శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ రమావత్ మురళి, వివిధ కళాశాలల పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
– మహిళా విభాగంలో ప్రథమ స్థానం – సౌజన్య, ఎస్.శివాని, ఆర్.సమత టీజీడబ్ల్యూఆర్డీసీ దేవరకొండ
– ద్వితీయ స్థానం- డి. వైష్ణవి, ఎసె.సమీలా, కె.ప్రవళిక- టీజీఎస్డబ్ల్యూఆర్పిఎఫ్ పీడీసీడబ్ల్యూ భువనగిరి
– పురుషుల విభాగంలో హరినాయక్- డాక్టర్ ఎంఎంఆర్ కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చౌటుప్పల్
Ramagiri : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : డా.హరీశ్ కుమార్