మునుగోడు రూరల్, సెప్టెంబర్ 25 : రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారంతోనే గర్భిణీలు, చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యమని సూపర్వైజర్ శిరీష అన్నారు. గురువారం చోల్లేడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహారంపై తల్లులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పుష్పలత, అంగన్వాడీ టీచర్లు అన్నపూర్ణ, సంతోషి, సరిత, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.