సూర్యాపేట, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుపై సొంత పార్టీలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత గాంధీభవన్ వరకూ చేరింది. సామేలు ఒంటెత్తు పోకడలు, కక్షపూరిత ధోరణితో తాము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆ పార్టీ నేతలు బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే విధానాలతో కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకుంటున్నదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సామేలు, ఆయన కొడుకుల వ్యవహార శైలిపై విచారణ కమిటీ వేసి, నివేదిక ప్రకారంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంటే సమన్వయ కమిటీ వేయాలని, అలాకాకుండా ఎమ్మెల్యేకే అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అప్పగిస్తే పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది అంటూ అడ్డగూడూరుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు హెచ్చరించినట్లు గూడెపు నాగరాజు పేరిట సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నది. ‘ఎమ్మెల్యే తీరుతో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు ద్వితీయశ్రేణి పౌరులుగా మారారు.
ఈ విధానం ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరమైన ఓటమి చూడాల్సి వస్తుంది. సామేల్తోపాటు ఆయన కుమారుల ఆగడాలకు అంతే లేకుం డా పోతున్నది. అడ్డగూడూరుకు చెందిన నివాసం కాంగ్రెస్ పార్టీ నా యకుడు, బీసీ నేత మారిశెట్టి మల్లేశ్‌పై ఎమ్మెల్యే మనుషులు దాడి చేశా రు. దాడికి పాల్పడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’ అంటూ పీసీసీ అధ్యక్షుడినికి కోరినట్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లో పేర్కొన్నారు.