– కేవీపీఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను
నిడమనూరు, జనవరి 14 : మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, సమాజంలో పోటీతత్వాన్ని ఎదుర్కోనేందుకు క్రీడా పోటీలు దోహద పడుతాయని కేవీపీఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను అన్నారు. బుధవారం నిడమనూరు మండలంలోని ముకుందాపురం గ్రామంలో భోగి పండుగ సందర్భంగా డీవైఎఫ్ఐ, మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు, యువతులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముఖ్య అథిగా కొండేటి శ్రీను హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు, యువతుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో మెలగాలన్నారు. సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులను యువత చైతన్యoతో ఎదుర్కోవాలన్నారు.
ముగ్గుల పోటీలో 32 మంది పాల్గొనగా ప్రథమ బహుమతి కుందనపల్లి ఉమా, ద్వితీయ బహుమతి వంగాల భవాని, తృతీయ బహుమతి లంకలపల్లి లక్ష్మమ్మతో పాటు పాల్గొన్న వారందరికీ బహుమతులను దాతల సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సలికంటి పద్మ, సీపీఎం నాయకులు కత్తి లింగారెడ్డి, కందుకూరి కోటేష్, మల్లికాంటి చంద్రశేఖర్, వేంపటి మహేశ్, వింజమూరి శివ, లెంకలపల్లి చిన్నా, యశోద, చిట్టీమల్ల నవీన్, వంగల ఫణింద్రచారి, సలీకంటి శ్రవణ్, భరత్, లెంకలపల్లి లక్ష్మమ్మ, నాగమ్మ పాల్గొన్నారు.