రామగిరి, జూలై 22 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు సమాజ సహకారం అవసరం అని కట్టంగూర్ మండలం యరసానిగూడెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం చింత యాదగిరి అన్నారు. మంగళవారం యరసానిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ యువత ఆకిటి వినోద్, ఆకిటి నవీన్, ఆకిటి మధు, భరత్ వారి కటుంబ సభ్యుల సహకారంతో వారి మాతృమూర్తి పుష్పలత జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులకు రూ.20 వేల విలువ గల షూస్, సాక్స్, బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ..దాతలు ఇదేవిధమైన సహకారం అందించడం ద్వారా విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు సమకూరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బుడిగెపాక శ్రీనివాస్, గాలి సంధ్యారాణి, శంకర్, తరాల పరమేశ్ యాదవ్ పాల్గొన్నారు.